ప్ర‌తిప‌క్షాల క‌ట్ట‌డి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ప్ర‌తిప‌క్షాల క‌ట్ట‌డి
– సీఎం ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునే నేత‌ల అరెస్టులు
– ముంద‌స్తుగా పోలీస్టేష‌న్ల‌కు త‌ర‌లింపు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో పోలీసులు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేశారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జాము నుంచి తాండూరు ప‌ట్ట‌ణంలో, తాండూరు, యాలాల మండ‌లాల్లో పోలీసులు బీజేపీ, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నేత‌ల‌ను ముందస్తు అరెస్టులు చేశారు. మంగ‌ళ‌వారం వికారాబాద్ జిల్లా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ విచ్చేస్తున్న విష‌యం తెలిసిందే. సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌నను అడ్డుకుంటామ‌ని కాంగ్రెస్, బీజేపీ నేత‌లు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై తాండూరు ప‌ట్ట‌ణంలో బీజేపీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు సుద‌ర్శ‌న్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కావ‌లి సంతోష్ కుమార్ ను అరెస్టు చేశారు. తాండూరు మండ‌లంలో యూత్ కాంగ్రెస్ నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షులు బోయ అశోక్ ను క‌ర‌ణ్ కోట్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ తాండూరు నియోజ‌క‌వ‌ర్గానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామిల‌ను విస్మ‌రించార‌ని, ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునేందుకు య‌త్నించే క్ర‌మంలో పోలీసులు అరెస్టు చేయ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌న్నారు. అరెస్టులు చేసినా ప్ర‌భుత్వం వ్య‌తిరేక విధానాల‌పై పోరాటం ఆపేదిలేద‌న్నారు.