నేటి నుంచే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ హాల్ టిక్కెట్లు

కెరీర్ తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

నేటి నుంచే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ హాల్ టిక్కెట్లు
– వెబ్ సైట్ ద్వారా డైన్ చేసుకోండి ఇలా
– సందేహాల కోసం ఫోన్ నెంబ‌ర్లు
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 28వ తేదీన నిర్వ‌హిస్తున్న‌ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క స‌మాచారం తెలిపింది. ప‌రీక్ష‌కు సిద్ద‌మైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా వారి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని సూచించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది TSLPRB. ఆగస్టు 18 ఉదయం 8 నుంచి ఆగస్టు 26 అర్థరాత్రి 12 గంటల వరకు TSLPRB వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులు తమ తమ హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని సూచించారు. ఈ హాల్ టికెట్లకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా, హాల్ టికెట్ డౌన్‌లోడ్ అవకపోయినా.. support@tslprb.in కి మెయిల్ చేయడం గానీ, 93937 11110, 93910 05006 నెంబర్లకు కాల్ చేయడం గానీ చేయొచ్చని TSLPRB పేర్కొంది. కాగా, 28న (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగనుంది. ఇక కానిస్టేబుల్ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.