మృతుల కుటుంబాలకు ఎమ్మెల్సీ పరామర్శ
– సానుభూతిని తెలిపిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రాంతానికి చెందిన పలువురు మృతుల కుటుంబాలను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం తాండూరు పట్టణానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎల్. ప్రభులింగం సతీమణి లింగదలి హైమావతి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో ఎడల మాణిక్యమ్మ కూడ మరణించడంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని ప్రకటించారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, పెద్దేముల్ పీఏసీఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, బోయరాజు, ఎంపీటీసీ రాము. ఇందూరు ప్రకాష్, నర్సింలు తదితరులు ఉన్నారు.


