విద్యార్థులను విస్మరిస్తున్న సర్కారు
– బడ్జెట్ పేరుతో విదేశీ విద్యకు బ్రేకులు
– ఫీజురియంబర్స్ మెంట్ చెల్లించకుండ ఇబ్బందులు
– విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
– బీసీ సంఘం తాండూరు కన్వినర్ రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సర్కారు విద్యార్థులను విస్మరిస్తోందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ మండిపడ్డారు. గురువారం బీసీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ తెలంగాణ మత్స్యశాఖ హైదరాబాద్ ప్రమోటర్ దీపిక ముదిరాజ్, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, రాష్ట్ర బీసీ సంఘం నాయకులు షుకూర్, విద్యార్థులతో కలిసి ఐలమ్మ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నేతలు, విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆర్డీఓ కార్యాలయం వరకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం రాజ్ కుమార్, పలువురు నేతలు మాట్లాడుతూ బీసీ విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. బడ్జెట్ లేదంటూ బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టరేట్ లు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు మాత్రమే నిధులు కేటాయించే ఎందుకు మాత్రం బడ్జెట్ ఉంటుందా అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీసీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వంకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళ అధ్యక్షురాలు నాయికోడి జ్యోతి, బషీరాబాద్ అధ్యక్షులు నరేందర్, యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణ చారి, నాయిబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పరమేష్, నర్సింలు. బీసీ యువజన రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, తాండ్ర సరేష్, కిరణ్ ముదిరాజ్, అజిత్ కుమార్, సురేందర్, విద్యార్థి సంఘం నాయకులు శ్రీకాంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


