బెధిరించి బంద్ చేస్తే చర్యలు
– ఇబ్బందులు పెడితే ఫిర్యాదు చేయండి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నందాల కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వివిధ సమస్యలు పరిష్కరించాలంటూ బంద్‌లు చేపట్టే సంఘాలు విద్యాసంస్థలపై బెధింరిపులకు పాల్పడితే చర్యలు తప్పవని వికారాబాద్ జిల్లా ఎస్పీ నందాల కొటిరెడ్డి పేర్కొన్నారు. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థి సంఘాలు మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ విషయాల పట్ల నిరసన తెలిపేందుకు విద్యా సంస్థల ను బంద్ చేయాలని పిలుపు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో ఎవరైనా విద్యాసంస్థలు(స్కూళ్లు, కాలేజీలు)ను బలవంతంగా, బెదిరించి బంద్ చేయాలని ఒత్తిడి చేసి గాని, బెదిరింపులకు పాల్పడినా ఇట్టి వారిపైన చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలా ఎవరైనా బలవంతంగా బంద్ చేయాలని ఒత్తిడి తీసుకువస్తే గాని, బెదిరించిన గాని విద్యాసంస్థల అధికారులు, యాజమాన్యాలు వెంటనే పోలీస్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. విద్యా సంస్థలను బంద్ చేయడం వలన విద్యార్థులను విద్య నుండి మరింత దూరం ఏర్పడుతందని అభిప్రాయపడ్డారు. కావున జిల్లా ప్రజలు ఇట్టి విషయాలపైన దృష్టి పెట్టాలని అన్నారు.


