ఫ్లై ఓవర్ బ్రిడ్జీపై ట్రాఫిక్ జామ్..!
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ట్రాఫిక్ జామ్ నెలకొంది. తాండూరు – కోడంగల్ రోడ్డు మార్గం వైపు వాహనాలు అన్నీ ఒకేసారి రావడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలన్నీ బ్రిడ్జిపై స్తంభించిపోయాయి. వాహనదారులు ముందుకు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని రద్దీని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

