రాద్దాంపు రాజకీయాలు మానుకోండి..!
– ఓటమిని జీర్ణించుకోలేక దుష్ప్రచార కుట్ర
– దాడులు చేసి సమర్ధించుకోవడం సిగ్గుచేటు
– అధికార పార్టీపై నిందలు వేయడం పిరికిపంద చర్య
– తప్పు చేయకుంటే తప్పించుకోవడం ఎందుకు
– మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల మండిపాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక అధికార పార్టీపై రాద్దాందం చేసే రాజకీయాలు మానుకోవాలని తాండూరు కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి, బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు.

కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల లెక్కింపు తోపులాట ఘటనను బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీపైకి నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కుట్రలు కుతంత్రాలు చేసి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసినా.. కూడా తాండూరు ప్రజల ఓటు దెబ్బతో ఓడిపోయిన రోహిత్ రెడ్డి ఓటమిని జీర్ణించుకోక ఉన్మాదంతో కౌంటింగ్ సెంటర్ వద్ద ఎన్నికల విధులలో ఉన్న పోలీసు అధికారుల మీద దాడి చేసి తప్పించుకొని పారిపోయారని విమర్శించారు.

ఎలాంటి తప్పు చేయకుంటే తప్పించుకుని తిరగడం ఎందుకని ప్రశ్నించారు. పైగా బహిరంగంగా దాడి చేసి ఎలాంటి తప్పు చేయలేదని సమర్థించుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇది రోహిత్ రెడ్డి రౌడీయిజానకి నిదర్శనం ఆని అన్నారు. చట్టాన్ని కాపాడే పోలీసుల మీద దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పైన చట్టరీత్య కఠినమైన చర్యలు తీసుకోవాలని తాండూరు ప్రజలు కోరుకుంటున్నారన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చకోవాడనికీ అధికార పార్టీపై నిందలు మెపడం అనేది నీ పిరికిపంద చర్యగా.. ఆయన దొంగ పనులకు నిదర్శనంగా అభివర్ణించారు. కౌటింగ్ రోజు నీ పార్టీ నీ అభ్యర్థులు ఓడిపోయారనే ప్రాస్టేషన్ లో డ్రగ్స్ తీసుకొని ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులపై చేయ్యి చేసుకోవడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న వారిని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించిన నీపై కేసులు కాకపోతే మరేం అవుతాయన్నారు పెదవి విరిచారు. చట్టం తనపని తాను చేసుకుంటుందని, దీనిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని గుర్తు చేశారు.


