పర్యావరణ గణపతిని పూజిస్తేనే ప్రాప్తి
– మట్టి వినాయకుల ప్రతిష్టాపన ఆదర్శనీయం
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ హిత గణనాథులను పూజించడం వల్ల భక్తులకు దైవ ప్రాప్తితో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం నాలుగో రోజు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో ప్రతిష్టించిన పరిగడ్డి వినాయకుడు, సావుకారు పేట్, వీవీహెచ్ఎస్ స్కూల్ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిష్టించిన మట్టి వి నాయకులను రాజ్ కుమార్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. మట్టి వినాయకులను ప్రతిష్టించిన మండపాల నిర్వహకులను అభినందించి సన్మానించారు.

ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు. మట్టి వినాయకులు, పర్యావరణ హిత గణనాథుల వల్ల పర్యావరణ పరిరక్షణ జరగడంతో పాటు భక్తులకు దైవప్రాప్తి లభిస్తుందన్నారు. వచ్చేసారి మరిన్ని మట్టి వినాయకులను ప్రతిష్టించేలా అధికారులు, నేతలు అవగాహన పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా: నాయకులు గడ్డం వెంకటేష్, మహిళ అధ్యక్షురాలు నాయికోడి జ్యోతి, బీసీ మీడియా సెల్ ఇంచార్జ్ బస్వరాజ్, యువనాయకులు రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, మంజుల, సురేంద్ర, మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.


