రేపు తాండూరుకు హ‌రీష్ రావు రాక

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు తాండూరుకు హ‌రీష్ రావు రాక
– ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు
– ప‌ర్య‌ట‌న విజ‌యవంతం చేయండి: ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం)
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు రేపు తాండూరుకు విచ్చేస్తున్నార‌ని టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం) తెలిపారు. తాండూరు ప‌ట్ట‌ణంలో, మండలంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌నలు, ప్రారంభోత్స‌వాలు చేస్తార‌ని తెలిపారు. శుక్ర‌వారం ఉద‌యం 10-30 గంట‌ల‌కు తాండూరు ప‌ట్ట‌ణం హైద‌రాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న మాతా శిశు ఆసుప‌త్రిలో షాపులు, రోగుల సంబంధికుల షెడ్డు నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తార‌ని చెప్పారు. అనంత‌రం ప‌ట్ట‌ణంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌తో పాటు ప‌ట్ట‌ణంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కు శంకుస్థాప‌న చేయ‌నున్నారని వెల్ల‌డించారు. అనంత‌రం తాండూరు మున్సిప‌ల్ ప‌రిధిలోని పాత తాండూరులో బ‌స్తీ ద‌వ‌ఖాన ప్రారంభోత్స‌వం త‌రువాత ప‌ట్ట‌ణంలోని నేష‌నల్ గార్డెన్‌లో ఆశ వ‌ర్క‌ర్ల‌కు చీర‌ల పంపిణీ చేయ‌నున్నారని తెలిపారు. దీంతో పాటు తాండూరు మండ‌లం జినుగుర్తి స‌మీపంలోని కేజీబీవీ స్కూల్‌లో అద‌న‌పు గ‌దులు స‌ముదాయం ప్రారంభోత్స‌వం చేయ‌నున్నారని వివ‌రించారు. మంత్రి హ‌రీష్ రావు ప‌ర్య‌ట‌న‌లో అధికారుల‌తో పాటు ప్ర‌జా ప్ర‌తినిధులు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీ ఎత్తున పాల్గొని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.