బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా యు.రమేష్ కుమార్
– ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతీయ జనతాపార్టీ(బీజేపీ) వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా యు.రమేష్ కుమార్ నియామకం అయ్యారు.

ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్‌రావు ప్రకటించగా.. ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు నియామకాన్ని జారీ చేశారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న మూడు జిల్లాలకు అధ్యక్షులను భాజపా ప్రకటించింది. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సాయి మల్లేశం, వికారాబాద్‌కు యు.రమేశ్, మేడ్చల్ మల్కాజ్‌గిరి (అర్బన్)కు అధ్యక్షుడిగా గిరివర్ధన్‌రెడ్డిని నియమించింది.

యు.రమేష్ కుమార్ గతంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. గతంలోనే జిల్లా అధ్యక్షులుగా నియామకం కావాల్సి ఉంది. మరోవైపు ఈ మూడు జిల్లాలకు సంబంధించి అధ్యక్షుల నియామకాలపై రాజకీయాలు చోటు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.

తాజాగా దిల్లీలో బండి సంజయ్ నివాసానికి ఈటల సహా ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వెళ్లారు. వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ జిల్లాల అధ్యక్షుల నియామకాలను పార్టీ ప్రకటించింది.


