విరాట్ విశ్వకర్మ ప్రపంచానికి ఆదర్శం
– తాండూరులో ఘనంగా జయంతి ఉత్సవాలు
– పాల్గొన్న చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విరాట్ విశ్వకర్మ భగవాన్ ప్రపంచానికే ఆదర్శమని పలువురు నాయకులు అభివర్ణించారు. శనివారం తాండూరు మండలం ఖాంజాపూర్ సమీపంలోని బ్రహ్మంగారి గుట్టపై విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ(విశ్వకర్మ) సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గుట్ట వద్దకు చేరుకుని విశ్వకర్మ భగవాన్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు.

ఈ జయంతి ఉత్సవాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీఎస్పీ శేఖర్ గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ ‘ మహారాజ్, పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి తదితరులు హాజరై యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వి శ్వకర్మ భగవాన్ ప్రంపచానికి ఆదర్శమన్నారు. విశ్వకర్మలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గద్దె శ్రీనివాస్ చారి, సీనీయర్ జర్నలిస్టు శ్రీనివాస్ చారి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర నాయకులు వెంకటేష్ చారి, మాజీ సర్పంచ్ పులిందర్ చారి తదితరులు పాల్గొన్నారు.


