కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి
– రుణమాఫీ, తులం బంగారం అమలు చేయాలి
– మోసం చేసిన సర్కారును గద్దె దిగేదాక ప్రశ్నిస్తాం
– తాండూరు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించిన బీజేపీ నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేర్చాలని బీజేపీ ప్రభారి గాజుల శాంతుకుమార్, వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు పటేల్ నరేందర్ రెడ్డి(సాయిరెడ్డి), ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు బొప్పి శ్రీహరి యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం ఆంజనేయులు డిమాండ్ చేశారు.

సోమవారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తాండూరు తహసీల్దార్ కార్యాలయం వరకు నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీతో చేరుకున్నారు. అనంతరం తహసీల్దార్ తారాసింగ్ కు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఈ నివేధిక పంపిస్తామని తెలిపారు.

అనంతరం నేతలు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని రోడ్లు, మురుగు కాలువలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రైతు రుణమాఫీ, తులం బంగారం, మహిళలకు రూ.2500లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామిలను ప్రజలకు అందించే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దిగేంత వరకు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామిలను సగం వరకు కూడా నెరవేర్చలేదన్నారు.

ప్రధానమంత్రి అమలు చేస్తున్న అవాస్ యోజన పథకాన్ని విస్మరించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పేరుతో అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. తాండూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్. నేతలు పి.రాములు, విజయ్ కుమార్, ఎర్ర శ్రీనివాస్, చిరంజీవి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

