ద‌స‌రా సెల‌వుల్లో కోత

కెరీర్ తాండూరు తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ద‌స‌రా సెల‌వుల్లో కోత
– 15 నుంచి 9 రోజుల‌కు కుదింపు
– ఉత్త‌ర్వులు జారీ చేసిన విద్యాశాఖ
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఇదివ‌ర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ద‌స‌రా సెల‌వుల్లో కోత విధించింది. గ‌తంలో 15 రోజుల పాటు సెల‌వులు ఉంటాయ‌ని ప్ర‌క‌టించ‌గా.. వాటిని 9 రోజులకు కుదిస్తున్న‌ట్లు విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈనెల 26 నుంచి వ‌చ్చే అక్టోబ‌ర్ 10వ తేది వ‌ర‌కు ద‌స‌రా సెలవులు ఉంటాయ‌ని ప్ర‌క‌టించించ‌న విష‌యం తెలిసిందే. అయితే దీనిపై కొన్ని విద్యాసంస్థ‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. భారీ వ‌ర్షాలు, తెలంగాణ వ‌జ్రోత్స‌వాల సంద‌ర్భంగా పాఠ‌శాల‌లు స‌క్ర‌మంగా కొన‌సాగ‌లేద‌ని గుర్తుచేశాయి. 15 రోజులు సెలవులు ఇవ్వ‌డం స‌రికాద‌ని అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశాయి. ఈ మేరకు ప్ర‌భుత్వం సెల‌వుల‌ను కుదించే నిర్ణ‌యాన్ని తీసుకున్నాయి. దీంతో అక్టోబ‌ర్ 1వ తేది నుంచి 9వ తేది వ‌ర‌కు ద‌స‌రా సెలవులు ఇవ్వ‌బోతున్న‌ట్లు విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.