పౌరులందరికి సమాన హక్కులు
– సద్వినియోగంగా వినియోగించుకోవాలి
– కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: భారత రాజ్యాంగం సమాజంలో పౌరులందరికి సమాన హక్కులను కల్పించిందని కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పౌరహక్కుల దినోత్సవం సందర్బంగా తాండూరు మండలంలోని ఐనెల్లి గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మధుసూధన్ రెడ్డి హాజరై ప్రజలకు చట్టాలు, రాజ్యాంగం, హక్కులపై అవగాహన కల్పించారు. ప్రజలు అంటరాని తనం విడనాడాలన్నారు. ప్రజలు చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. భారత రాజ్యాంగం పౌరులందరికి సమాన హక్కులు కల్పించడిందన్నారు. వాటిని అందరు సద్వినియోగం చేసుకోవాన్నారు. ప్రజలు అనవసరంగా గొడవలకు, ఘర్షణలకు పాల్పడరాదన్నారు. శాంతిభద్రతలకు అందరు సహకరించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకరావాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీప్యూటీ తహాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

