వ్యాపార రంగంలో వృద్ధి చెందాలి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

వ్యాపార రంగంలో వృద్ధి చెందాలి
– షాపింగ్ మాల్స్ ఏర్పాటు శుభ‌క‌ర‌మే
– రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి బావ‌నోళ్ల శంక‌ర్ యాద‌వ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వ్యాపార రంగంలో తాండూరు దిన దినాభివృద్ధిని సాధిస్తూ మోడ‌ల్ టౌన్‌గా ఎదగ‌డం సంతోషంగా ఉంద‌ని ప్ర‌ముఖ రియ‌ల్ ఏస్టేట్ వ్యాపారి, తాండూరు సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవ‌ల‌ప‌ర్స్ అధినేత బావ‌నోళ్ల శంక‌ర్ యాద‌వ్ అభిప్రాయ‌ప‌డ్డారు. ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా ఇటీవ‌ల తాండూరులో నూత‌నంగా ఏర్పాటు చేసిన ప్యారాగాన్ షోరూంను శంక‌ర్ యాద‌వ్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ తాండూరు ప్యారాగాన్ షోరూం నిర్వ‌హ‌కుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అదేవిధంగా రోజు రోజుకు తాండూరులో అతిపెద్ద షోరూంలు ఏర్పాటు కావ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. వ‌స్త్ర, వ్యాపార రంగాల‌లో వేగవంతంగా తాండూరు మోడ్ర‌న్ టౌన్‌గా ఎదుగుతుంద‌న్నారు. అన్ని రంగాల‌తో పాటు వ్యాపార రంగంలో వృద్ధిని సాధించేందుకు అంద‌రు స‌హ‌క‌రించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో బీసీ సంఘం జాతీయ క‌న్విన‌ర్ కందుకూరి రాజ్ కుమార్, స‌న్నిహితులు జొన్నల వినోద్, మ‌నోహ‌ర్ యాద‌వ్, బంటు మ‌ల్ల‌ప్ప త‌దిత‌రులు ఉన్నారు.