తెలంగాణ సర్దార్ మాణిక్ రావు
– సబ్బండ వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహానేత
– జయంతితో నివాళులు అర్పించిన బీసీ సంఘం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సబ్బండ వర్గాల అభివృద్ధికి పోరాడిన తెలంగాణ సర్దార్ స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్ రావు అని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అభివర్ణించారు. మంగళవారం బీసీ సంఘం ఆధ్వర్యంలో జయంతిని జరుపుకున్నారు. పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మాణిక్ రావు విగ్రహానికి రాజ్ కుమార్‌తో పాటు సంఘం నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడుగా మాణిక్ రావు ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారని అన్నారు. బహుజన వర్గాల అభ్యున్నతి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గళం విప్పిన నేతగా గుర్తుండి పోయారని అన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడిన ఆయన ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, మహిళ సంఘం అధ్యక్షురాలు జ్యోతి, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు లొంక నర్సింలు, తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు ఎస్పీ రవికాంత్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, రాము ముదిరాజ్, బీసీ సంఘం నియోజకవర్గ కార్యదర్శి బోయ రాధాకృష్ణ, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజు, నాయకులు బోయ మాధవ్, నాయి నరేష్, మతీన్, నగేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

