సాలె పురుగుకు మ‌నిషి త‌ల‌

జాతీయం తాండూరు తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

సాలె పురుగుకు మ‌నిషి త‌ల‌
– అబ్బుర ప‌రిచిన వింత స్పైడ‌ర్
– తాండూరులో ప‌ట్ట‌ణంలో గుర్తింపు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: మ‌న ఇండ్ల‌లో సాలె పురుగులు క‌నిపిస్తుంటాయి. అవి సాధార‌ణ‌మైన‌వి కావ‌డంతో వాటిపై ఎవ్వ‌రు ఆస‌క్తి చూప‌రు. అదే జీవి వింత ఆకారంలో క‌నిపిస్తే ఉత్సుక‌త‌తో ప‌రిశీలిస్తాం. అంత్యంత అరుదైన జాతికి చెందింద‌ని తెలిస్తే.. మ‌నిషి ఆకారానికి ద‌గ్గ‌ర‌గా అనిపిస్తే అద్భుత‌మై సంబ్రామాంశానికి లోన‌వుతాము. అలాంటి సంఘ‌ట‌న వికారాబాద్ జిల్లా తాండూరు ప‌ట్ట‌ణం సాయిపూర్‌లో చోటు చేసుకుంది. సాయిపూర్‌కు చెందిన రామకృష్ణ ఇంట్లో మనిషి తలను పోలిన సాలె పురుగు (స్పైడర్‌) క‌నిపించింది. మొద‌ట తేలిక‌గా తీసుకున్న‌ప్ప‌టికి ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలించ‌డంతో సాలె పురుగు వెనుక భాగం అచ్చం మనిషి తల, కళ్లు, నోరును పోలి ఉన్నట్లు స్పష్టంగా కనిపించాయి. ఇంటర్‌నెట్‌ వివరణ ప్రకారం ఇది అరుదైన జాతి సాలె పురుగు అని తెలుస్తోంది. ఇలాంటిది గతంలో చైనా దేశంలో కనిపించినట్టు.. దీని శాస్త్రీయ నామం అరేనియస్‌ మిటిఫికస్‌ అని సమాచారం. వింతైన సాలెపురుగును చూసిన ఆ ఇంట్లోని పిల్లలు స్పైడర్‌ మ్యాన్‌లా ఉందంటూ కేరింతలు కొట్టారు. శ‌నివారం ఈ సంఘ‌ట‌న వైర‌ల్‌గా మారింది.