బీజేపీలో చేరిన మురళీకృష్ణ గౌడ్
– కమలం గూటికి నరేష్ మహరాజ్
– ఢిల్లీలో కండువా కప్పుకున్న టీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎం.నరేష్ సుహరాజ్ు బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ నేత సడ్డా సమక్షంలో వారిద్దరు కమలం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, డీకే అరుణల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంకినేని వెంకటేశ్వర రావు, బుర్ర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. అయితే వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పదవికాలం ఇంకా కొనసాగినప్పటికి మురళీకృష్ణ గౌడ్‌ను పదవి నుంచి తప్పించారు. అంతకుముందు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో సంబధాలు దూరం కావడంతో దురుద్దేశంతోనే ఆయనను పదవి నుంచి తప్పించారనే విమర్శలు వచ్చాయి. పదవి కోల్పోయిన తరువాత మురళీకృష్ణ గౌడ్ బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన ప్రచారానికి తెరపెడుతూ ఆయన బీజేపీలో చేరారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వర్గీయ మాజీ మంత్రి చందు మహారాజ్ కుమారుడు ఎం.నరేష్ మహరాజ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎన్నికల ముగిసిన తరువాత టీఆర్ఎస్‌లో ఉన్నా కూడ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ మద్య కాలంలోనే ఆయన బీజేపీలో చేరుతున్నట్లు.. మంతనాలు సాగించినట్లు ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఆయన బీజేపీలో చేరారు.

