మృతుల కుటుంబాలకు అండ

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మృతుల కుటుంబాలకు అండ
– ప్రభుత్వ సాయం అందేలా కృషి
– రోడ్డు ప్రమాద బాధతులకు మెరుగైన వైద్యం
– జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: శ్రీశైల దైవదర్శన యాత్రలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేసి.. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చొరవ చూపుతామని వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. ఆదివారం యాలాల మండలం జుంటుపల్లికి చెందిన ఉప్పరి భీమయ్య కుటుంబ సభ్యులు శ్రీశైల దర్శనానికి వెళుతుండగా నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగగా ఆటో డ్రైవర్‌తో పాటు ఉప్పరి భీమయ్య కుటుంబానికి చెందిన మాణెమ్మ, కవితలు దుర్మరణం చెందారు. మిగత వారు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఆదివారం సాయంత్రం వారి మృతదేహాలు స్వగ్రామానికి వచ్చాయి. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృత దేహాలకు పూలమాల వేసి అంజలి ఘటించారు. కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడ అందజేశారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం నుంచి తగిన సాయం అందజేసేలా దృష్టిసారిస్తామన్నారు. విద్యార్థులకు చదువు విషయంలో పూర్తి సహకారాన్నిఅందిస్తామన్నారు. అదేవిధంగా ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా చొరవ చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరిహర గౌడ్, సర్పంచ్ వెంకటరెడ్డి, ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, గ్రామ సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు.