ఆ కీచ‌క ప‌ర్వానికి 600 పేజీల ఆధారాలు 

క్రైం జాతీయం హైదరాబాద్

ఆ కీచ‌క ప‌ర్వానికి 600 పేజీల ఆధారాలు 
– మాజీ సీఐ నాగ‌రేశ్వ‌ర్ రావుపై చార్జీసీట్ దాఖ‌లు
– 75 మందిని సాక్షులుగా చేర్చిన పోలీసులు
హైదరాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: మాజీ సీఐ నాగేశ్వ‌ర్ రావు అత్యాచారం కేసులో నేరానికి సంబంధించిన ఆధారాల‌తో అత‌నిపై వ‌న‌స్థ‌లి పురం పోలీసులు చార్జ్‌సీట్ న‌మోదు చేశారు. మొత్తం 600 పేజీలతో ఈ ఛార్జ్‌షీట్ న‌మోదు చేసి 75 మంది సాక్షులను చేర్చారు. ఈ నివేధిక‌ను ఎల్బీ నగర్‌ కోర్టుకు సమర్పించారు. గ‌త‌ జులై 7న వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో నాగేశ్వర్‌రావుపై ఓ మహిళ తనపై అత్యాచారం చేయడంతో పాటు.. అపహరించారని ఓ మ‌హిళ ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు మాజీ సీఐ నాగేశ్వ‌ర్ రావుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జులై 11న నాగేశ్వర్‌రావును అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు విచారణ ఎల్బీ నగర్ కోర్టులో కొనసాగుతోంది. నాగేశ్వర్‌రావు హైకోర్టు నుంచి బెయిల్ పొందడంతో చర్లపల్లి జైలు నుంచి బయటికి వచ్చాడు. అయితే జులై 18న నాగేశ్వ‌ర్ రావును కస్టడీలోకి తీసుకొని ఐదు రోజుల పాటు ప్రశ్నించారు. ఈ విచార‌ణ‌లో నాగేశ్వర్‌రావు మొబైల్‌ను ఆధారంగా అత్యాచారం జరిగిన సమయంలో ఆయన మహిళ ఇంట్లోనే ఉన్నట్లు నిర్దారించారు. నాగేశ్వర్‌రావు అత్యాచారం చేశారనడానికి తగిన ఆధారాలు సేకరించారు. మహిళ లోదుస్తుల్లో నమూనాలు సేకరించి నాగేశ్వర్‌రావు డీఎన్ఏతో సరిపోల్చారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఈ రెండూ సరిపోలాయి. సీసీ కెమెరా దృశ్యాలను సైతం పరిశీలించారు. మహిళ నివాసముండే ఇంటి వాచ్‌మెన్‌తో పాటు చుట్టుపక్కల వాళ్ల సాక్ష్యాలను నమోదు చేశారు. ఈ విషయాలన్నింటినీ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. అత్యాచార ఆరోపణలు రావడంతో ఆయన్ను ఇటీవలే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విధుల నుంచి తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.