ఒంటికన్ను మేకపిల్ల
– వికారాబాద్‌లో వింతగా జననం
– ఆసక్తిగా తిలకించిన జనం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: సృష్టిలో కొన్ని జంతువుల జననం వింతగా జరుగుతాయి. మునుపెన్నడో లేదా.. అరుదుగా వెలుగులోకి వచ్చే అలాంటి సంఘటనలు అందరికి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి ఘటనే వికారాబాద్ మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ మేకకు ఒంటికన్నుతో మేకపిల్ల జన్మింది. వివరాల్లోకి వెళితే…వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని జాంబపూర్ తండాకు చెందిన పాండు అనే రైతుకు మేకలు ఉన్నాయి. అందులో ఓ మేక వింత మేక పిల్లకు జన్మనిచ్చింది. ఎలా అంటే జన్మించిన మేక పిల్ల ఒకే కన్నుతో ఉండడం విశేషం. ఒంటి కన్నుతో జన్మించిన మేక పిల్లను చూసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. దీనిపై కొందరు కాలజ్ఞాన చరిత్రలు చర్చించుకుంటే.. వైద్య నిఫుణులు మాత్రం జంతువుల్లో జన్యుపరమైన లోపాలు సంభవిస్తే ఇలాంటివి జరుగుతాయని పేర్కొంటున్నారు.

