మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– కూలీల కుటుంబ సభ్యులకు పరామర్శ
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా ధారూర్ మండల పరిధి కేరెళ్లి – బాచారం వద్ద జరిగిన ఆటో, లారీ ఢీకొని జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దెముల్ మండలం మదనంతపూర్ కు చెందిన రవి, కిషన్, హేమ్లా నాయక్, అదేవిధంగా రేగొండికి చెందిన ఆటో డ్రైవర్ జలీల్ మృత దేహాలకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రేగొండిలో మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్సీ వెంట నాయకులు పీఏసీఎస్ చైర్మెన్ విష్ణువర్ధన్ రెడ్డి, మదనంతపుర్ సర్పంచ్ గోవర్ధన్, రేగోండి సర్పంచ్ హైదర్, డివై నర్సింహులు, ఎఫ్‌ఏసీఎస్ డైరెక్టర్ గెమ్య నాయక్, మంబాపూర్ టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

