రేపటి ప్రజావాణి రద్దు

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపటి ప్రజావాణి రద్దు
– ప్రకటించిన జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రేపు రద్దు చేసినట్లు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనివార్య కారణాల వల్ల 7వ తేది సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని తెలిపారు. ఇది తాత్కాళికం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజలు ఇట్టి విషయాన్ని గ్రహించి తమ దరఖాస్తులను అందించేందుకు కలక్టరేట్ కార్యాలయానికి వచ్చి ఇబ్బంది పడరాదని సూచించారు. తరువాతి వారం నిర్వహించే ప్రజావాణిపై స్పష్టత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.