కార్తీక వైభోగం..!

తాండూరు వికారాబాద్

కార్తీక వైభోగం..!
– శివయ్యను దర్శించుకున్న భక్తులు
– రామలింగేశ్వర స్వామిగ దర్శనమిచ్చిన శివుడు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో కార్తీక మాస వైభోగం కొనసాగుతోంది. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా తాండూరు పట్టణం, మండలంలోని శైవ క్షేత్రాలు కిటకిటలాడాయి. తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయం, అంతప్ప భావి శివాలయం, చెరువెంటి ఈశ్వరాలయం, పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయంలో శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అదేవిధంగా తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానంలో వెలసిన మహా శివుడు భక్తులు పూజలందుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. మరోవైపు తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో శివుడు కీసర గుట్టలో వెలసిన భవాని సమేత రామలింగేశ్వర స్వామి ఆలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ పూజారి విజయ్ కుమార్ స్వామి శివునికి ఈ ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్వామి ముందు వెలసిన నందీశ్వరుని వద్ద కార్తీక దీపాలను వెలగించి మొక్కులు తీర్చుకున్నారు.