జాగ్రత్తలు పాటిస్తే క్షయ నయం

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

జాగ్రత్తలు పాటిస్తే క్షయ నయం
– అయినా అందరు అప్రమత్తంగా ఉండాలి
– జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డా.రవీంద్ర యాదవ్
– తాండూరులో ఉచిత పరీక్ష శిభిరానికి స్పందన
తాండూరు, దర్శిని ప్రతినిధి: జాగ్రత్తలతోనే క్షయ వ్యాధిని నియంత్రించడం సాధ్యమవుతుందని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ రవీంద్ర యాదవ్ అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని బస్తీ దవఖానలో క్షయ వ్యాధి ఉచిత ఎక్స్ రే పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత పరీక్ష శిబిరానికి మంచి స్పందన లభించింది. దాదాపు 120 మందికి పరీక్షలు నిర్వహించుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ క్షయ వ్యాధి పట్ల అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగింపు వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే మందులతో నివారించవచ్చన్నారు. ఇందుకు ప్రభుత్వం ఉచితంగా మందులను పంపిణీ చేస్తుందన్నారు. జాగ్రత్తలతోనే వ్యాధిని నియంత్రించవచ్చన్నారు. వ్యాధిన బారిన పడకుండా అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్, డాక్టర్ సౌమ్య, సూపర్ వైజర్ బస్వరాజు, అరుణ్ కుమార్, నోడల్ పర్సన్ శ్యామల, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.