ఆధార్‌ ఆప్‌డేట్ ఫ్రీ..!

జాతీయం టెక్నాలజీ తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఆధార్‌ ఆప్‌డేట్ ఫ్రీ..!
– 17 ఏండ్లలోపు వారికి ఉచితం
– ఎలా, ఎక్కడ చేసుకోవాలంటే..?
దర్శిని డెస్క్ : అదేంటీ ఆధార్ ఆప్‌డేట్ ఫ్రీగా చేసుకోవచ్చా.. అనే అనుమానం కలిగితే.. అదినిజమే అని ఆధార్‌ సంస్థ స్పష్టం చేస్తోంది. ఆధార్‌ ఆప్‌ డేట్ చేసుకోవాంటే ఫీజు చెల్లించాల్సిందే. కాని 17 ఏండ్లలోపు వారికి ఉచితంగా చేసుకునే అవకాశం కల్పించింది.

ప్రభుత్వ పథకాలు, ధ్రువపత్రాలు, ఉపకారవేతనాలు ఇతరత్రా పొందాలంటే ఆధార్‌ కీలకమైంది. చిన్నప్పుడే ఆధార్‌ కార్డు తీసుకున్నా ప్రతి ఐదేళ్లకు, 15 ఏళ్లకు నవీకరణ చేసుకోవాలి. కొందరు చేసుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. పిల్లల ఆధార్‌ తప్పనిసరి అని ఆధార్‌ రెగ్యులేషన్స్‌ 2016 చట్టం చెబుతోంది.

ఐదేళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు ఆధార్‌ రిజిస్ట్రేషన్‌ చేసి ఉంటే.. ఐదేళ్లు దాటిన తర్వాత రీ రిజిస్ట్రేషన్‌ చేయించాలి. దీన్ని మాండేటరీ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ (ఎంబీయూ) అంటారు. ఇది మొదటి బయోమెట్రిక్‌ అప్‌డేట్‌. ఈ సమయంలో పూర్తి బయోడేటా సమర్పించాలి. ఇది కొత్తదే. కానీ పిల్లల ఆధార్‌ నంబరులో ఎలాంటి మార్పు ఉండదు. పిల్లల ఆధార్‌ నవీకరణ చేయకపోతే నంబరు డీయాక్టివేట్‌ అవుతుంది. ఐదేళ్లు దాటిన చిన్నారుల ఆధార్‌ అప్‌డేట్‌ రెండేళ్లలోపు చేయించాలి. వారికి ఏడేళ్లు నిండేలోపు పూర్తి చేయాలి.

పిల్లలకు తొలిసారి ఆధార్‌ తీసుకుంటున్నప్పుడు పుట్టినరోజు ధ్రువపత్రం, తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్‌ కార్డు అవసరం. ఐదేళ్లలోపు వారిని కేంద్రాలకు తీసుకెళ్లాల్సిన పనిలేదు. కానీ బయోమెట్రిక్‌ సమయంలో తప్పనిసరి. మళ్లీ 15 ఏళ్ల తర్వాత అప్‌డేట్‌ చేయించాలి. ప్రస్తుతం 17 ఏళ్ల లోపు పిల్లలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఐదేళ్లు దాటి 15 సంవత్సరాలలోపు పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ సూచించింది.

ఇదికూడా చదవండి…

కొత్త సర్పంచుల కీలక నిర్ణయం..!