మిస్టరీగా తల్లీ, కొడుకుల ఆత్మహత్యలు..!
– మతుని మర్మాంగాల వద్ద కనిపించిన రక్తం
– సన్సెన్స్గా మారిన కాశింపూర్ ఘటన
– పోస్టుమార్టం తరువాతే అసలు నిజాలు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని కాశీంపూర్లో జరిగిన తల్లీ, కొడుకుల ఆత్మహత్యల ఘటన మిస్టరీగా మారింది. కుమారుడి ఆత్మహత్యలలో అనుమానాలు వ్యక్తం కావడంతో విషాధకర సంఘటనలో సస్పెన్స్ ఏర్పడింది. కాశింపూర్ గ్రామానికి చెందిన కూలీ పనులు చేసుకునే ఎల్లమ్మ(50), పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్న మొగులప్ప(35)లు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన తెలిసిందే.

ఈ విషయం తెలుసుకున్న బషీరాబాద్ ఎస్ శంకర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలింగా మొగులప్ప మర్మాంగాల వద్ద రక్తం కనిపించింది. దీంతో మొగులప్పది ఆత్మహత్యలో అనుమానాలు రేకెత్తాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఉద్రిక్తతల మద్యే పోలీసులు మృదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. తల్లీతో పాటు కుమారుడు ఆత్మహత్యలపై గ్రామంలో రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. కుమారుడు మొగులప్ప మృతిపై భార్య రేణుకపై అనుమానాలు వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వరకు ఈ సంఘటనపై పోలీసులు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తి అయిన తరువాత అసలు నిజాలు వెల్లడిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
ఇదికూడా చదవండి…

