రోహిత్ రెడ్డికి జై..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రోహిత్ రెడ్డికి జై..!
– మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిద్దాం
– తాండూరులో నేతలు, ప్రజాబంధు ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇదేం ఎన్నికల సీజన్ కాదు.. ఇప్పట్లో ఎన్నికలూ లేవూ.. కాని తాండూరు ఎమ్మెల్యేగా మళ్లీ రోహిత్ రెడ్డిని గెలిపించుకుందామని టీఆర్ఎస్ పట్టణ యువనాయకులు, ప్రజాబంధు బృందం కోరుతున్నారు. తాండూరు పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు అఫ్పూ(నయూం) ఆదేశాల మేరకు 30వ వార్డులో టీఆర్ఎస్ యువనాయకులు అబుకర్, ప్రజాబంధు పట్టణ కోఆర్డీనేటర్ ప్రభులు ప్రచారం చేపట్టారు. ఈసందర్భంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. రోహిత్ రెడ్డికి జై అంటూ ప్రజల చేత నినాదాలు చేయించారు. తాండూరుకు నర్సింగ్ కళాశాల, పాత తాండూరు రైల్వే అండర్ బ్రిడ్జి, రోడ్ల అభివృద్ధి పనులతో ఎన్నడూ లేని విధంగా ప్రగతి పథాన నడిపిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యేగా మళ్లీ రోహిత్ రెడ్డిని గెలిపించుకుందామని సూచించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభివృద్ధిపై అందరు హర్షిస్తున్నారని నాయకులు అబుకర్, ప్రజాబంధు బృందం తెలిపారు. నర్సింగ్ కాలేజీ, రైల్వే అండర్ బ్రిడ్జి, రోడ్ల విస్తరణ, అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాబంధు క్లస్టర్ ఇంచార్జి విజయ్, సభ్యులు పాల్గొన్నారు.