నందిని యాదయ్య గౌడ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
– అల్లాపూర్ సర్పంచ్‌గా తిరిగి బాధ్యతల స్వీకరణ
– హైకోర్టు ఉత్తర్వులతో జిల్లా కలెక్టర్ ఆదేశాలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: నిధుల దుర్వినియోగం అంటూ ఆరోపణలు ఎదుర్కొన్న తాండూరు మండలం అల్లాపూర్ సర్పంచ్ నందిని యాదయ్య గౌడ్‌పై సస్పెన్షన్ ఎత్తివేశారు. హైకోర్టు ఉత్తర్వులతో జిల్లా కలెక్టర్ విధించిన సస్పెన్షన్‌ను తొలగిస్తూ డీపీఓకు ఆదేశాలు చేశారు. ఈ మేరకు నందిని యాదయ్య గౌడ్ అల్లాపూర్ గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలను చేపట్టనున్నారు. గత మే మాసంలో పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలపై జిల్లా కలెక్టర్ కె. నిఖిల సర్పంచ్ నందినిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీనిని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో పంచాయతి రాజ్ చట్టానికి విరుద్దంగా సస్పెన్షన్ వేటు వేశారని కోర్టు.. స్టేను నిలివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అ తరువాత గ్రామ సర్పంచ్‌గా ఉపసర్పంచ్‌కు బాధ్యతలు అప్పగించారు. తాజాగా హైకోర్టులో దాఖలైన ఫిటిషన్ పెండింగ్‌లో ఉందని, అప్పటి వరకు సర్పంచ్‌గా నందిని యాదయ్య గౌడ్‌ను కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీపీఓకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గ్రామ సర్పంచ్‌గా నందిని యాదయ్య గౌడ్ మళ్లీ నియామకం అయ్యారు.


