ఎవరి పనులు వాళ్లు చేసుకోండి
– కరోనా ఫోర్త్ వేవ్‌పై ఆందోళన వద్దు
– ఎదుర్కొనేందుకు చర్యలు సిద్దం చేసిన సర్కారు
– ఆసక్తికర వాఖ్యలు చేసిన డీహెచ్ శ్రీనివాసరావు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఎవరి పనులు వాళ్లు చేసుకోండి.. కరోనా ఫోర్త్ వేవ్‌పై ఆందోళన వద్దని.. ఏసు క్రీస్తు ప్రభువు దయతో కరోనా తగ్గిందని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ సంచాలకులు(డీహెచ్) శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం యాదాద్రిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న డీహెచ్ శ్రీనివాస్ రావు మీడీయాతో కరోనా ఫోర్త్ వేవ్‌పై పైవిధంగా స్పందించారు. యాదాద్రీశుడి దయతో కొవిడ్ వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అన్నారు. ఇక ఫోర్త్ వేవ్‌పై ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉందన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి కొవిడ్‌పై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపామని తెలిపారు. కొవిడ్ ఫోర్త్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్నా.. మరణాల శాతం ఉండబోదని, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని డీహెచ్ వివరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఎవరి పనులు వారు చేసుకోవాలని సూచించారు.

