ఖజానాకు కలిసొచ్చిన న్యూ.. కిక్కు
– తెలంగాణలో పెరిగిన మద్యం ఆదాయం
– రెండు రోజుల్లోనే రూ. 470 కోట్ల అమ్మకాలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సర్కారు ఖజానాకు న్యూఇయర్ మాంచి కిక్కించింది. మద్యం అమ్మకాలకు ఇచ్చిన అనుమతులు ప్రభుత్వానికి కలిసొచ్చింది. దీంతో ప్రభుత్వ ఆదాయం బాగా పెరిగింది. కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబరు 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 31వ తేదీ రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ విషయం తెలిసిందే. అంతకుముందు 6 రోజుల నుంచి మద్యం అమ్మకాలపై ప్రభావం కనిపించింది. అప్పటి నుంచి రికార్డు స్థాయిలో రూ.1,111.29 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడించాయి. డిసెంబరు 30న అత్యధికంగా రూ.254 కోట్లు, 31న రూ.216 కోట్లు విలువైన మద్యం అమ్ముడైందని తెలిపింది. గత యేడాదితో పోలిస్తే 2021 డిసెంబరు 31వ తేదీన రూ.171.93 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయని ఆబ్కారీ శాఖ అధికారులు పేర్కొనగా.. ఈ కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయ వేళలు ప్రభుత్వం పొడిగించడం మందు బాబులకు కలిసొచ్చింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు మద్యం పుల్లుగా కిక్కించింది.

