సూపర్ మార్నింగ్ డ్రింక్‌..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

సూపర్ మార్నింగ్ డ్రింక్‌..!
– తేనే, నిమ్మరసంలో ప్రయోజనాలు
– ఆరోగ్యానికి చేసే మేలు తెలుసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రతి రోజు అందరికి ఉదయం కాఫీ లేదా టీ తాగడం అలవాటు. కొందరు మాత్రమే తేనే, నిమ్మరసం తాగుతారు. ఎందుకంటే ఇది సూపర్‌ మార్నింగ్ డ్రింక్ కాబట్టి. అయితే తేనే, నిమ్మరసం కలిపి తాగితే ఆరోగ్యరసం అని నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే టీ, కాఫీల కంటే కూడా గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తేనె కలుపుకొని తీసుకోవడం చాలా మంచిదనే ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే అధిక బరువు, బీపీ, డయాబెటీస్ వంటి వాటితో ఇబ్బంది పడేవారు కూడా ఎక్కువ మొత్తంలోనే ఉన్నారు. వీరిలోని చాలా మంది బరువు తగ్గాలనే ప్రయత్నంలో భాగంగా తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగుతుంటారు.

తేనె, నిమ్మరసం కలిస్తే ఏం జరుగుతుంది..?
తేనె, నిమ్మకాయ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రీ రాడికల్స్‌తో పోరాటానికి కావల్సిన శక్తిని శరీరానికి ఇస్తాయి. అందుకే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సలహా ఇస్తుంటారు. ఈ రకమైన పానీయం శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. నిజానికి ఇది సూపర్ మార్నింగ్ డ్రింక్. దీనిని తాగడం వల్ల జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది. తద్వారా బరువు తగ్గడంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ఎలా తీసుకోవాలి?
తేనె, నిమ్మరసం తయారుచేసుకునే నీళ్లు గోరువెచ్చగా ఉండాలి. 200 నుంచి 250 మి.లీ. నీళ్లకు నిమ్మకాయ, తేనె కలిపి తాగాలి. నెమ్మదిగా రుచి ఎంజాయ్ చేస్తు తాగితే మరీ మంచిది. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా తాగితే తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయి. పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరగడం ప్రారంభం అవుతుంది.