అట్టహాసంగా ప‌టేల్ శ్రీ‌శైలం జ‌న్మ‌దిన వేడుక‌లు

తాండూరు రాజకీయం వికారాబాద్

అట్టహాసంగా ప‌టేల్ శ్రీ‌శైలం జ‌న్మ‌దిన వేడుక‌లు
– శుభాకాంక్ష‌లు తెలిపి స‌న్మానించిన నాయ‌కులు, వ్యాపారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు వీర‌శైవ స‌మాజం అధ్య‌క్షులు, టీఆర్సీ అధ్య‌క్షులు, ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ మాజీ అధ్య‌క్షులు ప‌టేల్ శ్రీ‌శైలం 68వ జ‌న్మ‌దిన వేడుక‌లు అట్టహాసంగా జ‌రిగాయి. ప‌టేల్ శ్రీ‌శైలం జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆదివారం రాత్రి దాటిన త‌రువాత‌ తాండూరు ప‌ట్ట‌ణం నెహ్రు గంజ్ స‌మీపంలో జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా స‌మాజం స‌భ్యులు, గంజ్ వ్యాపారులు ప‌టేల్ శ్రీ‌శైలంను శాలువాతో స‌త్క‌రించి.. పూల మాల‌ల‌తో స‌న్మానించారు. అనంత‌రం ప‌టేల్ శ్రీ‌శైలం చేత కేక్‌ను క‌ట్ చేయించారు. ప‌టేల్ శ్రీ‌శైలం జ‌న్మ‌దిన సంద‌ర్భంగా వీర‌శైవ స‌మాజం, వీర‌శైవ యువ‌ద‌ళ్‌ స‌భ్యుల‌తో పాటు దిగ్రేన్ అండ్ సీడ్స్ మ‌ర్చంట్స్ అధ్య‌క్షులు ప‌టేల్ రాంరెడ్డి, ప్రధాన కార్య‌ద‌ర్శి క‌ట్కం వీరేంద‌ర్‌తో పాటు ఎం. మాణిక్యం, లింగాయత్ సమాజం పెద్దలు ఆర్.బస్వరాజ్, వాలి శాంతుకుమార్, కందనెల్లి ప్రకాశం, గూళీ పరమేశ్వర్, పటేల్ కుమార్, నాగభూషణం, ఘనాపూర్ శంకర్, కోటం సిద్దలింగం, ప‌లువురు ప్రముఖులు, ప‌ట్ట‌ణ వ్యాపారులుఅభిమానులు త‌దిత‌రులు హాజ‌రై శుభాకాంక్ష‌లు తెలిపి స‌న్మానించారు. మ‌రోవైపు కుమారులు ప‌టేల్ కిర‌ణ్ కుమార్, ప‌టేల్ ప్ర‌వీణ్, మ‌నుమండ్లు, మ‌నుమ‌రాండ్లు కూడ శుభాకాంక్ష‌లు తెలిపారు.