మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ డేట్ ఫిక్స్
– 25న కార్యాలయంలో సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈనెల 25న మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్దం చేస్తున్నారు. సమావేశంలో చర్చించే కౌన్సిల్ ఎజెండాను రూపొందించారు. బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశ మందిరంలో చైర్ పర్సన్ అధ్యక్షతన సమావేశం ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని వైస్ చైర్ పర్సన్, ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులకు సర్క్యూలర్ జారీ చేశారు. మున్సిపల్‌కు మంజూరైన నిధులు, అభివృద్ధి పనులు, కార్మికుల అంశాలను ఎజెండాలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. వివాదాల తరువాత నిర్వహిస్తున్న కౌన్సిల్ సమావేశంపై అందరి దృష్టి పడింది. సమావేశం సవ్యంగా జరుగుతుందా లేదా అని ఉత్కంఠత నెలకొంది.


