సీబీఐ విచారణకే గ్రీన్ సిగ్నల్‌..!

క్రైం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

సీబీఐ విచారణకే గ్రీన్ సిగ్నల్‌..!
– ఎమ్మెల్యే కొనుగోలు కేసుపై హైకోర్టు సంచనల తీర్పు
– విచారణ ముమ్మరం చేయాలని ఆదేశాలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలో ఉత్కంఠతకు గురిచేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఈ కేసును సీబీఐతోనే విచారణ జరిపించాలని ఆదేశించింది. మోయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో కొందరు వ్యక్తులు.. తమను ప్రలోభపెట్టారన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే తమకు డబ్బు ఆశ చూపారని, పార్టీ మారేందుకు ఒత్తిడి చేశారని, దీంతో ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. గతంలో సీబీఐతో విచారణకు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎటువంటి మనీలాండరింగ్‌ జరగనప్పటికీ ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ను సమర్ధించిన డివిజన్ బెంజ్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేపించాలని ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలో ఏర్పడింది. ఈ ఆదేశాలపై తెలంగాణ సర్కార్.. డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. సీబీఐ విచారణకే మొగ్గు చూపింది. మరోవైపు ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వాలని రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేయడంతో.. విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.