ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
– 4 వేల వీడియో పాఠాలు సిద్దం చేసిన విద్యాశాఖ
– ఎక్కడ చూడాలో అందరు తెలుసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియేట్ విద్యార్థులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులు తమ పాఠాలను వీడియో రూపంలో చూసేలా, వినేలా అవకాశాన్ని కల్పించబోతోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా కమీషనర్ నవీన్ మిట్టల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ విద్యార్థుల కోసం 4 వేల వీడియో పాఠాలను ఇంటర్ విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చినట్లు అందులో స్పష్టం చేశారు. జనరల్, ఒకేషనల్‌తో పాటు సామాన్యశాస్త్రం ప్రయోగ పరీక్షల పాఠాలు, పరీక్షలకు సంబంధించిన టిప్స్, ప్రోత్సాహాన్ని ఇచ్చే ప్రసంగాలను కూడా చేర్చింది. యూట్యూట్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇ లెర్నింగ్ తెలంగాణ అని సెర్చ్ చేసి వీడియోలను చూసుకోవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని వార్షిక పరీక్షలకు విద్యార్థులు మరింత సన్నద్ధం కావాలని ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో సూచించారు.

