కొత్త నెంబర్‌కే కంప్లెంట్ చేయండి
– కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండల ప్రజలకు కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కీలక సూచన చేశారు. జిల్లాలోని పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లలో మార్పులు జరిగాయని, ఇందులో కరణ్ కోట్ పోలీసు అధికారుల నెంబర్లు కూడ మారడం జరిగిందన్నారు. ఇదివరకు ఉన్న కరణ్ కోట్ ఎస్ఎస్ఐ పేరుతో ఉన్న సెల్: 9440627239 స్థానంలో కొత్త నెంబర్ సెల్: 8712670052కు మార్చడం జరిగిందన్నారు. కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు ఉండే పాత నెంబర్‌కు కాకుండా కొత్త నెంబర్ సెల్: 8712670052కు కంప్లెంట్ చేయాలని సూచించారు. అసాంఘీక కార్యక్రమాలు, సంఘటనలు జరిగితే కొత్త నెంబర్‌కే సమాచారం అందించాలన్నారు. ఫోన్ నెంబర్ మార్పు విషయాన్ని గమనించాలని, కొత్త నెంబరును అందరు సేవ్ చేసుకోవాలని అన్నారు.

