ఖుషీ. ఖుషీగా కేసీఆర్‌ బర్త్‌డే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఖుషీ. ఖుషీగా కేసీఆర్‌ బర్త్‌డే..!
– 500ల మంది అన్నదానం
– అభిమానుల మద్య సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) 69వ జన్మదిన వేడుకలు తాండూరులో అట్టహాసంగా జరుగుతున్నాయి. శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో ఉన్న బస్తీ దవాఖానలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ ఇర్ఫార్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి, భద్రేశ్వర దేవాలయ చైర్మన్ బంటారం సుధాకర్‌, ఉర్దూఘర్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌ తదితరులు హాజరయ్యారు. ముందుగా సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నేతలు అభిమానుల మద్య కేక్‌ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సీఎం కేసీఆర్‌కు శుభాకంక్షలు తెలిపారు. అనంతరం 500ల మందికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల దేవుడని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్న మహనాయకులు అని అన్నారు. ఆయన నిండూ నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ.. రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు నడిపంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువనాయకులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను సమర్పించిన వారు…