భారం మోపే బీజేపీని బొందపెట్టాలే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భారం మోపే బీజేపీని బొందపెట్టాలే..!
– పేద, మద్యతరగతి ప్రజల ఉసురు తప్పదు
– పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలి
-తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– గ్యాస్ ధరల పెంపుపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు
– పీఎం నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వంట గ్యాస్‌ ధరలను పెంచి పేదలపై భారం మోపుతున్న బీజేపీని బొందపెట్టాలని బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ధ్వజమెత్తారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాలతో పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. చేపట్టారు.

పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు బీజేపీ తీరుపై భగ్గుమన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ డౌన్ డౌన్.. మోడీ డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఖాళీ సిలిండర్లు, కట్టెల పొయ్యిని రోడ్డుపై ఉంచి గ్యాస్ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకు దేవుడు అయితే.. ప్రధాన నరేంద్రమోడి సంక్షేమాన్ని విస్మరిస్తూ పేదల మనసుల్లో రాక్షసుడు అయ్యారని నిర్వచించారు. 8 ఏండ్లలో బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి పేదల పై భారం మోపుతుందన్నారు. మళ్లీ కట్టెల పొయ్యి దిక్కు అన్నట్లు మహిళలకు మోడీ మహిళా దినోత్సవ కానుక అందజేశారని ఎద్దేవా చేశారు. ఆధాని, అంబానీలతో పాటు కార్పోరేట్ సంస్కలకు కొమ్ముకాస్తూ.. ధరలను పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీని బొంద పెట్టాలని అన్నారు. రాష్ట్రంలో, తాండూరులో ఉన్న బీజేపీ నేతలు, కొత్తగా వచ్చిన నేతలు మత విద్వేశాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, కార్యక్రమాలకు వచ్చి నప్పుడు వారిని గట్టిగా నిలదీయాలని సూచించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించకుంటే పేద మహిళల ఉసురు తప్పదని, కేంద్ర వ్యతిరేక విధానాలకు బీఆర్ఎస్ ఎదురెళ్లి పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సంస్క చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్‌, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారి, నరేందర్ గౌడ్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, కౌన్సిలర్లు, దేవాలయాల చైర్మన్లు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.