టీఆర్ఎస్ బ‌లోపేతానికి కృషి చేయండి

తాండూరు వికారాబాద్

టీఆర్ఎస్ బ‌లోపేతానికి కృషి చేయండి
– స‌ర్కారు సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి
– ఎంపి రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: టీఆర్ఎస్ పార్టీని రాజ‌కీయాల‌కు అతీతంగా బ‌లోపేతానికి కృషిచేయాల‌ని చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండుర్ హోట‌ల్‌లో ఎంపీ రంజిత్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పార్టీ తాండూరు నియోజకవర్గం ఇన్చార్జి జహంగీర్ పాషాలు మీడియాతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని తాండూరు ప‌ట్ట‌ణం, తాండూరు మండ‌లం, పెద్దేముల్, యాలాల‌, బ‌షీరాబాద్ మండ‌లాల‌ పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 65 ల‌క్ష‌ల స‌భ్య‌త్వం క‌లిగిన అతిపెద్ద పార్టీ టీఆర్ఎస్ అన్నారు. నూతనంగా నియామకంమైన కమిటీలు పార్టీ బలోపేతానికి కృషిచేయాలని వారు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి వర్యులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారధ్యంలో రాష్ట్రం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది అని తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం అవ్వడానికి నూతన కమిటీలు దోహదం చేస్తాయి అని వారు తెలిపారు. స‌ర్కారు సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా టీఆర్ఎస్ పార్టీని బ‌లోపేతం చేసి ఏ ఎన్నికలొచ్చిన గెలిచేపార్టీగా తీర్చిదిద్దడ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌న్నారు. అదేవిధంగా త్వ‌ర‌లోనే కోట్‌ప‌ల్లి మండ‌ల కమిటిని ఏర్పాటు చేస్తామ‌న్నారు.

ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల‌కు స‌న్మానం
అనంత‌రం టీఆర్ఎస్ పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులుగా ఎన్నికైన అఫ్పూ(న‌యూం) ఆధ్వ‌ర్యంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిల‌కు స‌న్మానం నిర్వ‌హించారు.
త‌న‌న‌ను ప‌ట్ట‌ణ అధ్య‌క్షులుగా ఎన్నుకున్నంద‌కు ఆయ‌న‌ పార్టీ నాయకుల‌తో క‌లిసి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల‌ను గ‌జ‌మాల‌తో స‌త్క‌రించి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర నాయ‌కులు ర‌బ్బాని, డీసీసీబీ మాజీ చైర్మ‌న్ ల‌క్ష్మారెడ్డి, మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ విశ్వ‌నాథ్ గౌడ్, నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.