లిక్కర్, లీకేజీలపై భగ్గుమన్న కాంగ్రెస్

తాండూరు రాజకీయం వికారాబాద్

లిక్కర్, లీకేజీలపై భగ్గుమన్న కాంగ్రెస్
– సర్కారు చేతగాని తనంపై దర్నా
– తాండూరులో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
– టీఎస్పీఎస్సీపై సిట్టింగ్ జడ్జి, సిఐడీలతో విచారణకు డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, కవిత లిక్కర్ స్కాంలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. రమేష్ మహరాజ్ ఆదేశాల మేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన దర్నాలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, జెడ్పీటీసీ ధారాసింగ్, పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.

దర్నాలో నాయకులు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. తమ స్వార్థం కోసం నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో నిర్వహించిన గ్రూప్ పరీక్షలలో కూడలో కవిత హస్తంతో పేపర్లను లీకేజీ చేశారని ఆరోపించారు. తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్లను కూడ లీకేజీ చేశారని, ఇందులో మంత్రి కేటీఆర్, అతని పీఏ హస్తం ఉందని ఆరోపించారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ కూతురు కవితతో లిక్కర్ స్కాం చేయించి లక్షల కోట్లు దోచుకుని.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని ద్వజమెత్తారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నియామకాలు, ఇంటికో ఉద్యోగం అంటూ మోసం చేశారని అన్నారు. లిక్కర్ స్కాం, పేపర్ లీకేజీలతో మళ్లీ దోపికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని అన్నారు. తమ తప్పులను కప్పిపిచ్చుకునేందుకు సిట్ విచారణ వేశారని, ఇందులో బాధితులకు ఎలాంటి న్యాయం జరగదని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సెట్టింగ్ జడ్జి లేదా సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, సర్దార్ ఖాన్, బస్వరాజ్, మాజీ వైస్ చైర్మన్ ఎంఏ అలీం, యూత్ కాంగ్రెస్ తాండూరు కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, నారా అశోక్, రాము, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.