వ్యాపారికి హార్ట్ ఎటాక్..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

వ్యాపారికి హార్ట్ ఎటాక్..!
– సీపీఆర్ చేసి కాపాడిన హెడ్ కానిస్టేబుల్
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణానికి చెందిన ఓ వ్యాపారి గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ బాధితునికి సీపీఆర్ చేసి ప్రాణం కాపాడే ప్రయత్నం చేశారు. సకాలంలో చేసిన చర్యలకు బాధితుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం తులసీనగర్‌కు చెందిన నగేష్ (36) పట్టణంలో ఉషోదయ షోరూం నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉండగా కుప్పకూలి పడిపోయాడు. ఆందోళన చెందిన భార్య భారీగా కేకలు వేసింది. అదే కాలనీలో ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ కుమారుడు కేకలు విని తండ్రికి తెలిపాడు. వెంటనే హెడ్‌ కానిస్టేబుల్ రామకృష్ణ ఇంట్లోకి వెళ్లి చూడగా నగేష్ అపస్మారక స్థితిలో పడిఉన్నాడు. గుండె కొట్టుకోవడం లేదని గమనించి వెంటనే సీపీఆర్ చేశారు. క్షణాల్లో గుండె కొట్టుకోవడంతో వెంటనే కారులో మళ్లీ సీపీఆర్‌ చేసుకుంటూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం నగేష్ కు ప్రాణాపాయం తప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.