పరీక్షలు చేసుకోండి.. క్యాన్సర్‌ను జయంచండి..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పరీక్షలు చేసుకోండి.. క్యాన్సర్‌ను జయంచండి..!
– ఈనెల 13న ఉచిత మెగా క్యాన్సర్ నిర్ధారణ శిభిరం

– బీవీజీ ఫౌండేషన్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వైద్య పరీక్షలను చేయించుకుని క్యాన్సర్ మహమ్మారిని జయించవచ్చని తాండూరు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బాలాజీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు. ఈనెల 13న తాండూరులో ఉచిత మెగా క్యానర్స్ నిర్ధారణ పరీక్ష శిబిరం ఏర్పాట్లు చేస్తున్నట్లు మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. తాండూరుకు చెందిన కీ.శే. కల్వ అనురాధ జయంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ప్రముఖ వ్యాపార వేత్త కల్వ సుధాకర్‌, బీవీజీ ఫౌండేషన్, ఆర్యవైశ్య సంఘం సహాకారంలో ఈ పరీక్ష శిబిరాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 13వ తేది తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి పరీక్ష శిబిరం ప్రారంభమవుతుందని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి వారి సౌజన్యంలో అత్యాధునిక వైద్య పరికరాలతో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, పేదలు ఈ అవకాశన్నా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ క్యానర్సర్‌ లక్షణాలుంటే పరీక్షలు తప్పనిసరి
క్యాన్సర్ మానవ శరీరంలో వివిధ భాగాలకు సోకే విధానాన్ని బట్టి రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఎముకల క్యాన్సర్, గొంతు క్యాన్టర్, బ్రెయిన్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, చర్మ క్యాన్సర్ వంటి లక్షణాలతో బాధపడే వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా 1) ఎంతకీ మానని పుండు లేదా కురుపు. 2) రొమ్ము ప్రదేశంలో గానీ మరేచోటనైనా గానీ వాపు రావడం, గట్టి పడటం. 3) పుట్టుమచ్చలో గానీ, పులిపిరిలో గానీ మార్పులు రావడం. 4) చాలాకాలంగా గొంతు బొంగురు పోయి వుండటం, వీడని దగ్గు, 5) రోజుల తరబడి అజీర్ణం, ఆహారం మింగేటప్పుడు కష్టంగా ఉండటం. 6) జీర్ణాశయ వ్యవస్థలో, మలమూత్ర విసర్జన పద్ధతిలో ఆకస్మిక మార్పులు. 7) 35 సం॥లు వయస్సు దాటిన స్త్రీలలో అధికంగా తెల్లబట్ట, ఎర్రబట్ట రావడం లక్షణాలు ఉన్న వారికి కూడ పరీక్షలను నిర్వహిస్తారు. ఉచితంగా మందులను అందజేశారు. అదేవిధంగా ఆపరేషన్లు అవసరమైన వారికి హైదరాబాద్‌ ప్రైవేటు ఆసుపత్రిలకు రిఫర్ చేసి ఆర్థిక చేయూతను కూడ అందిస్తామని డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వ సుధాకర్‌ తదితరులు ఉన్నారు.