వాట్సాప్‌లో క్రేజీ.. ఫీచర్..!
– ఎక్స్‌పైరింగ్ గ్రూప్ వ్యవస్థ
– పనితీరు, ఉపయోగం ఏంటంటే
దర్శిని డెస్క్: సాంకేతిక రంగంలో వాట్సాఫ్ వ్యవస్థ విప్లవాత్మకం. అత్యధి వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సంస్థ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకవస్తుంది. తాజాగా వినియోగదారుల కోసం క్రేజీ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.
అదేంటో.. ఎలా పనిచేస్తుందో.. ఎలాంటి ఉపయోగం ఉందో తెలుసుకుందాం. మనం తాత్కాళిక అవసరం కోసం గ్రూపు ఏర్పాటు చేస్తాం. అవసరం తీరాకా దానికి అలాగే వదిలేస్తుంటాం.
ఉదహరణకు.. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓ టూర్ ప్లాన్ చేస్తారు. టూర్‌కి సంబంధించిన అన్ని వివరాలను చర్చించుకోవడం కోసం ఒక గ్రూప్‌ను స్టార్ట్ చేస్తారు. నిజానికి టూర్ ముగిసిన తర్వాత ఆ గ్రూప్ అవసరం ఉండదు. దీంతో ఆ గ్రూప్‌ను డిలీట్ చేయడం మర్చిపోతుంటారు. దీంతో చాట్ బాక్స్‌లో గ్రూప్ ఖాళీగా ఉండిపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ‘ఎక్స్‌పైరింగ్ గ్రూప్’ అనే పేరుతో వాట్సాప్ ఫీచర్‌ను తీసుకురానుంది.
ఈ ఫీచర్‌తో తాత్కలిక అవసరం కోసం ఏర్పాటు చేసిన గ్రూప్ కొంత సమయానికి ఆటోమెటిగ్‌గా డిలీట్ చేసుకోవచ్చు. ఏ తేదీన గ్రూప్ డిలీట్ అవ్వాలో గ్రూప్ క్రియేట్ చేసే సమయంలో సెట్ చేసుకోవచ్చు. దీంతో అనవసర గ్రూప్‌లు వాటంతటవే డిలీట్ అవుతాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. టెస్టింగ్ పూర్తికాగానే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. వాట్సాప్ గ్రూప్‌లకు సంబంధించిన ఈ ఫీచర్ యూజర్లను మరింత ఆకర్షిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

