రేసీంగ్‌పై సీరీయస్..!
– స్పందించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
– 70 బైకులు, 30 కార్లు ఉన్నట్లు అంచనా
– నిర్వహకులపై ఆరా తీస్తున్న పోలీసులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో సంచలనంగా మారిన కార్లు, బైకు రేసింగ్ సంఘటనపై జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, అధికార యంత్రాంగం సీరీయస్ అయ్యింది. అనుమతులు లేకుండా చేసిన రేసింగ్‌పై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు బిజీగా ఉన్నారు. దీన్నిఅదునుగా చేసుకుని సుమారు 70 బైకులు, 30 కారులతో యువకులు రేసింగ్ చేపట్టినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రేసింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అధికారులు తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. రేసింగ్ జరిగిన ప్రాంతాన్ని అటవీ శాఖ, పోలీస్ అధికారులు పరిశీలించారు. అనంతగిరి అడవుల్లో ఎక్కడెక్కడా రేసింగ్ నిర్వహించే స్పాట్స్ ఉన్నాయో వాటిని పరిశీలించారు. అడవి మొత్తాన్ని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు చుట్టేశారు. రేసింగ్‌లో ఎంతమంది పాల్గొన్నారు.. ఎవరు సహకరించారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రేసింగ్ నిర్వాహకులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు సన్నద్దమవుతున్నారు. ఇదే సంఘటనపై జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్పందిస్తూ ఇప్పటికే కొన్ని వాహనాలను గుర్తించామని.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేసింగ్‌లో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. రేసింగ్ నిర్వాహకులను గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి…

