చిక్కుల్లేని ప్లాట్లనే సొంతం చేసుకోండి
– రాజీవ్ స్వగృహా అన్ని సదుపాయాలు కల్పిస్తాం
– ఈనెల 17, 18 తేదిల్లో రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం
– ఫ్రీ బిడ్డింగ్ సమావేశంలో తాండూరు ఆర్డీఓ ఆశోక్ కుమార్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ఎలాంటి చిక్కులు లేని ప్లాట్లను బహిరంగ వేలంలో విక్రయించడం జరుగుతుందని తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ అన్నారు. యాలాల మండలం కోకట్ గ్రామ పరిధిలోని మనోహ టౌన్ షిప్ రాజీవ్ స్వగృహాలో మిగిలిన 54 గృహాలు, 14 ఓపెన్ ప్లాట్లకు ఈనెల 17, 18వ తేదిలలో నిర్వహించే బహిరంగా వేలం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఔత్సహికులకు రెండో విడత ఫ్రీ బిల్డింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ రాజీవ్ స్వగృహాలో అప్రూవ్డ్ లేఅవుట్ కింద అన్ని అనుమతులు ఉన్న ప్లాట్లకు వేలం వేయడం జరుగుతుందన్నారు. ఈనెల 17,18వ తేదిలలో బహిరంగ వేలం ఉంటుందని, వేలంలో పాల్గొనదలచిన వారు రూ. 10 వేల డీడీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ వేలంలో ప్లాట్లు దక్కించుకున్నవారు ఒకేసారి డబ్బులు చెల్లిస్తే 2 శాతం సబ్సిడీ అందించడం జరుగుతుందని తెలిపారు. లేదా 90రోజులలో వాయిదా పద్ధతిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒకే సారి లేదా మూడు వాయిదా పద్ధతిలో చెల్లించాలన్నారు. 7 రోజులు ఒకసారి, 45 రోజులకు ఒకసారి 90 రోజులకు ఒకసారి మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నారు. వేలంలో ఎలాంటి చిక్కులు లేని ప్లాట్లను లబ్ధిదారులకు అందిస్తామని, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిన్నప్పలు నాయుడు, ఎంపీడీఓ సుదర్శన్ రెడ్డి, టీఎస్ఐఐసి జోనల్ మేనేజర్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

