నేడు, రేపు విస్తారంగా వర్షాలు

ఆరోగ్యం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

నేడు, రేపు విస్తారంగా వర్షాలు
– అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ద్రోణి ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాలు ఇంకా రెండు,మూడు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాయలసీమతో పాటు, తమిళనాడును వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. దక్షిణ తమిళనాడులోని 5 జిల్లాలతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. శని, ఆదివారాలు కూడా వరుణుడు విజృంభించనున్నాడు. మారిన వాతావరణం కారణంగా. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.