8, 9న ఎస్ఐ, ఏఎస్ఐ పరీక్షలు

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

8, 9న ఎస్ఐ, ఏఎస్ఐ పరీక్షలు
– ఎల్లుండి నుంచే హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్
– ప్రకటించిన పోలీస్‌ రిక్రూట్ మెంట్ బోర్డు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈనెల 8, 9వ తేదిలలో ఎస్ఐ, ఏఎస్ఐ తుది పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్దమయ్యాయి. ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఆ రెండు తేదీలలో తుది పరీక్షలకు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌ మెంట్ బోర్డు తెలిపింది. ఈ పరీక్ష లు హైదరాబాద్, వరంగల్, కరీంన గర్ కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు సంబంధిం చి 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుం చి సాయంత్రం 5:30 వరకు ఇం గ్లిష్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా ఎస్సిటీ ఎస్సె (సివిల్) పోస్టులకు 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జనరల్ స్టడీస్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించి ఎల్లుండి 3వ తేదీ ఉద యం 8. గంటల నుంచి 6వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు టీఎస్ఎల్పీ ఆర్బీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది.