నీటి తిప్పలు దూరంపై దృష్టి
– ప్రతి వార్డులో బోరు మోటార్లు
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే వేసవలో పట్టణ వాసులకు నీటి తిప్పలను దూరం చేసేందుకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దృష్టిసారిస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో తాండూరు పట్టణంలోని వార్డుల్లో తాగునీటి బోరు మోటార్ల పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం పట్టణంలోని 6, 24, 32, 33 వ వార్డులలో బోరు మోటార్ల పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు హాజరై వార్డు కౌన్సిలర్, పెద్దలతో కలిసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో పట్టణంలోని ప్రతి వార్డులో బోరు మోటార్లు వేయించడం జరుగుతుందన్నారు. వచ్చే వేసవిలో ప్రజలకు నీటి తిప్పలు తలెత్తకుండా ఉండేందుకు దృష్టిసారించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ చారి, 24వ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత, స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవ్ రావు, పొట్లీ మహరాజ్ దేవాలయ చైర్మన్ రాజన్ గౌడ్, బీఆర్‌ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, చంటి యాదవ్, శివనంద్, బాలక్రిష్ణ రెడ్డి, రాజు, టైలర్ రమేష్, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

