కాలనీల అభివృద్ధిపై దృష్టి
– తాండూరు మున్సిపల్ కమిషనర్ శంకర్ సింగ్
– రాజీవ్, ఇందిరమ్మ కాలనీలను సందర్శించిన కమీషనర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీల అభివృద్ధిపై దృష్టి పెడతామని కమీషనర్ శంకర్ సింగ్ అన్నారు. మంగళవారం రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీలను సందర్శించారు. వార్డు కౌన్సిలర్ వెంకన్న గౌడ్ తో కలిసి కాలనీ సమస్యలపై ఆరా తీశారు. రెండు కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, వంటి సౌకర్యాలను పరిశీలించారు. కాలనీలో డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
వార్డు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. త్వరలోనే అందరి సహాకారంతో కాలనీలను అభివృద్ధి పరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరీ ఇను స్పెక్టర్ ఉమేష్ కుమార్, కాలనీ నాయకులు తదితరులు ఉన్నారు.

